calender_icon.png 17 August, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్కాన్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

17-08-2025 12:52:00 AM

  1. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 16 (విజయ క్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం హైదరాబాద్‌లోని అబిడ్స్ ఇస్కా న్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌రాంచందర్‌రావు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీకృష్ణ జన్మా ష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరగడం ఎంతో సంతోషకరమ న్నారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు రాష్ర్ట ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.“హరే కృష్ణ” నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.