calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో క్షత్రియ భారీ బహిరంగ సభ

14-10-2025 12:04:31 AM

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్

ముషీరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): త్వరలో లక్ష మంది క్షత్రియ రాజ్‌పుత్‌లతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నారు. ఈ మేరకు సోమవారం అంబర్‌పేటలోని మహారాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో రాజ్ పుత్ క్షత్రియ సమాజ్ దసరా సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్షత్రియ సమాజం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్, బీటెక్ తదితర విద్యలో రాణించిన ప్రతిభావంతుల విద్యార్థినీ, విద్యార్థులకు స్కాలర్షిప్‌లతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ  కార్యక్రమంలో క్షత్రియ రాజ్పుత్ సభా అధ్యక్షులు ఠాకూర్ జైవీర్ సింగ్, ఉపాధ్యక్షులు మహేందర్ ప్రతాప్ సింగ్, సెక్రటరీ ఠాకూర్ అరుణ్సింగ్, జనరల్ సెక్ర టరీలీలు ఠాకూర్ సంతోష్ సింగ్, ఆర్గనైజర్సెక్రటరీ ఠాకూర్ సునితా దేవి, ట్రెజరర్ ఠాకూర్ నరేంద ర్సింగ్, అడ్వకేట్ ఠాకూర్ జస్వంత్ సింగ్ పాల్గొన్నారు.