calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుక్కెడు బువ్వ కోసం తల్లి ఆరాటం

14-10-2025 12:04:56 AM

కలెక్టర్ కార్యాలయంలో  ఫిర్యాదు

గద్వాల,  అక్టోబర్ 13 : తల్లి కడుపు కోత ఎంత రగిలిందో, బుక్కెడు బువ్వకోసం చదువుకున్న కొడుకులపై ఏకంగా ప్రజావాణి లోనే ఫిర్యాదు చేసింది ఓ కన్నతల్లి. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్తులో తల్లిదండ్రులకు సేవలు చేయాలని చెప్పే పంతుల్లే కన్నతల్లికి భోజనం పెట్టని పరిస్థితి నెలకొంది. ఆమె  యావదాస్తులు రాయించుకుని కన్నతల్లిని పట్టించుకోని ప్రబుద్ధులు కొడుకులు.

బుక్కెడు బువ్వ కోసం ఒక కన్నతల్లి సోమవారం  ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏకం గా కలెక్టర్ కె తన సొంత కొడుకులు కుమార్తె పై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే వెళితే గద్వాల పట్టణానికి చెందిన  శంకరమ్మ(68) వీవర్స్ కాలనీలో నివాసముండగా ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులుగా మంచి స్థానంలో ఉండగా వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని ఇద్దరు కుమారులు కుమార్తె ల సమానంగా ఆస్తి పంపకాలు జరిగాయని ప్రతినెల ఇద్దరు కుమారులు 10000 కూతురు 2000 ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకొని ఆస్తిని సమానంగా పంచుకొని పెద్దల సమక్షంలో నిర్ణయించారని ఆమె తెలిపారు.

అస్తిపంచుకున్న తర్వాత కుమారుడు కూతురు నెలల ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా  ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టరేట్ కార్యాల యంలో కన్నీటి పర్వంతమయ్యారు. అనారోగ్య కారణాల వల్ల ప్రతినెల  వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇబ్బంది అవుతున్నాయని కొడుకులని అడగగా డబ్బులు అడిగితే  తన్ని తరిమేస్తామని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు బోరునా విలపించారు.