calender_icon.png 14 October, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

14-10-2025 12:00:00 AM

కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ 

కుత్బుల్లాపూర్,అక్టోబర్ 13(విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్‌ను అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్‌లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.3,00,000/- సీఎంఆర్‌ఎఫ్‌ను చెక్కులను శంభీపూర్ క్రిష్ణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ గద్దె నరసింహ, మాజీ ఎంపీటీసీ ఆకుల భార్గవ్, పీఏసీఎస్ డైరెక్టర్ అర్కల జీతయ్య, మాజీ వార్డు సభ్యులు ఉప్పరి బాలకృష్ణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.