22-11-2025 01:49:40 AM
ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): పత్తి పంట అమ్మకాలలో ఎదురవు తున్న సమస్యల పరిష్కారానికి అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న నేతృత్వంలో చేపట్టిన ‘హలో రైతన్న.. ఛలో బోరజ్’ కార్యక్ర మానికి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు.
బీఆర్‌ఎస్‌తో సహా సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, రైతు సం ఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించా రు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై జొన్న రొట్టె లు తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
వివిధ గ్రామాల నుండి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జోగు రామన్న ఎడ్ల బండి ఎక్కి నిరసనలో పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించా రు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ తేమ శాతం నిబంధనలు తొలగించాలని, 7 క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని, కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పత్తి కొనుగోలు ప్రారంభమైన నాటి నుండి రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు కష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చలించకపోవడం సిగ్గుచేటు అన్నారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పి న స్థానిక ఎమ్మెల్యే.. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని విమర్శించారు. రైతులతో రాజకీయం చేస్తున్నారన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు రైతుల నిరసనతో ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశ గా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఆయా పార్టీల నేతలు దర్శనాల మల్లేష్, సిర్ర దేవేందర్, వెంకట నారాయణ, చారులత రా థోడ్, గోవర్ధన్ యాదవ్, రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రితో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.