26-07-2024 11:41:49 AM
వట్టినాగులపల్లి: రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ లో 483 మంది శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు.