calender_icon.png 13 May, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ధిక నేరానికి పాల్పడ్డ రేవంత్.. సీఎం వెనక బీజేపీ ఎంపీ

11-04-2025 12:37:59 PM

ఆ బీజేపీ ఎంపీ పేరు వచ్చే ఎపిసోడ్ లో బయటపెడతా

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి అటవీ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy government) తాకట్టు పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President K. T. Rama Rao) శుక్రవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉండదని సూచించారు. ముఖ్యమంత్రికి ఓ బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించారని ఆయన వెల్లడించారు. 400 ఎకరాలకు టీజీఐఐసీకి యజమాని కాదని కేటీఆర్ చెప్పారు. తనది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టు పెట్టిందని తెలిపారు. మోసపూరిత భూమని తాకట్టుపెట్టుకుని బ్యాంకు రుణం ఇచ్చిందన్నారు.

400 ఎకరాల భూమి విలువ రూ. 5,239 కోట్లు అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ (Registration and Stamps Department) చెబుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే భూమి విలువ రూ.30 వేల కోట్లు అని రెవెన్యూ శాఖ చెప్పిందని వివరించారు. నిబంధనలు తుంగలోతొక్కి ఆర్థిక నేరానికి పాల్పడ్డారని కేటీఆర్ ధ్వజమెత్తారు. జరిగిన ఆర్థిక నేరంపై దర్యాప్తు కోసం లేఖలు రాస్తున్నానని పేర్కొన్నారు. కేంద్రం, ఆర్బీఐ, సీబీఐ, సీవీసీ, సెబీ, ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు చేయమని కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు. మొత్తం కుంభకోణం వెనుక రేవంత్ రెడ్డికి అండగా ఓ బీజేపీ ఎంపీ(Bharatiya Janata Party MP) నిలబడ్డారని కేటీఆర్ పునర్ఘటించారు. తనకు అండగా నిలబడిన బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచించారు. కుంభకోణానికి సహకరించిన బీజేపీ ఎంపీ పేరు వచ్చే ఎపిసోడ్ లో బయటపెడతానని కేటీఆర్ స్పష్టం చేశారు.