13-05-2025 08:44:32 PM
సింగరేణి ఏరియా జిఎం దేవేందర్...
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురి అయినట్లైతే సంబంధిత ఇంటర్నల్ కమిటీ సభ్యులకు ఫిర్యాదు చేయాలని, లైంగిక వేధింపుల సమస్యల పరిష్కారానికే ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఏరియా జిఎం జి దేవేందర్(Singareni Area GM Devender) తెలిపారు. పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం వర్క్ షాప్ టు క్రియేట్ అవేర్నెస్ సెక్సువల్ హరాస్మెంట్ ఆక్ట్ (పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ) పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జిఎం జి దేవేందర్ హాజరయ్యారు.
ఈ అవగాహన కార్యక్రమంలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో నుండి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ సభ్యులు పాల్గొనగా, వీరికి పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ అనే అంశంపై విశాఖపట్ననికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ అడ్వకేట్, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ వి పార్వతీశం పలు అంశాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం జి దేవేందర్ మాట్లాడుతూ... సింగరేణిలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగినిలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, సంతోషకరమైన వాతావరణంలో పనులు చేసుకుంటూ, సింగరేణి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఎంపిటిసి మేనేజర్ శంకర్, ఎంవిటిసి ట్రైనింగ్ అధికారి అశోక్, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.