calender_icon.png 13 May, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎస్సీలో ఉర్దూ మీడియం స్టేట్ టాపర్ కు మైనార్టీ నాయకుల సన్మానం

13-05-2025 08:59:06 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్సీ ఫలితాల్లో ఉర్దూ మీడియం స్టేట్ టాపర్ ఎండి అయాన్ ను నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్ఎస్సీలో 600 మార్కులకు గాను 561 మార్కులు సాధించి ఉర్దూ మీడియం స్టేట్ టాపర్గా నిలిచిన విద్యార్థి ఎండి అయాన్ సాధించిన ఘనతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు విద్యార్థిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యులు యూత్ అహ్మద్ ఖాన్ మైనారిటీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా నాయకులు ఎండి ఇద్రిస్ ఎండి అయూబ్ ముషీద్ జియో అమీర్ సమీర్ తదితరులు ఉన్నారు.