13-05-2025 08:32:07 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) మాతృమూర్తి వెంకట నరసమ్మ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్రతో పాటు ఆయన సోదరులు వద్దిరాజు కిషన్, దేవేందర్, వెంకటేశ్వర్లు మోహన్, వెంకటేశ్వర్లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇనుగుర్తిలో తల్లిదండ్రులు నారాయణ వెంకట నరసమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతి వనంలో తన తల్లిదండ్రులు నారాయణ, వెంకట నరసమ్మ విగ్రహాల వద్ద పుష్పగుచ్చలుంచి నివాళులర్పించారు. అనంతరం 1000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.