24-07-2025 07:24:08 PM
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి కేటీఆర్(KTR) జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కేక్ కట్ చేసి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి తినిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఊడెం కృష్ణారెడ్డి, నర్సింగరావు, దేవి రవీందర్, విరాసత్ అలీ, గోలి సంతోష్ కుమార్, గోపాల్ రెడ్డి, మరికంటి కనకయ్య, బాలమణి, నరేష్, రామచంద్రం బెండ మధు, జుబేర్ పాష, స్వామి, రమేష్ గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.