calender_icon.png 27 July, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్ప్రవర్తనతో మెలగండి

24-07-2025 07:19:52 PM

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ డి జానకి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): గతంలో చేసిన తప్పులను మరోమారు చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ఎస్పీ డి జానకి(District SP D Janaki) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రాబోయే ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా, చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య పాల్గొన్నారు.