calender_icon.png 26 July, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2025 12:01:57 PM

మేడ్చల్ అర్బన్: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) 49వ జన్మదిన వేడుకలను మేడ్చల్ బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లాంగ్ లీవ్ కేటీఆర్ అంటూ నాయకులు నినాదాలు చేశారు. రానున్న రోజుల్లో కేటీఆర్ ఉన్నత పదవులను అద్ధరోహించాలని కోరుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో విష్ణు చారి,నర్సింగ్ గౌడ్,సంబు ప్రభాకర్,సంజీవ రావు,ప్రతాప్, నవీన్,లాల్లు,రవి,రాజు,మహేందర్ రెడ్డి,విట్ఠల్,కన్నీ,నిశిత రెడ్డి,అరుణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.