calender_icon.png 26 July, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

24-07-2025 12:14:03 PM

ఇల్లందు టౌన్, (విజయక్రాంతి): బయ్యారం మండలం(Bayyaram Mandal) టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన పర్యటనలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను గురువారం ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న గదులను తొలగించి తక్షణమే నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.