calender_icon.png 22 November, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదు

26-07-2024 12:35:28 PM

ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం

హైదరాబాద్: గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పంప్ హౌస్ లు ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేదని ఇంజినీర్లు చెప్పారని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్ హౌస్ లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2 లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీరు నింపాలన్నారు. ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకుంటే తామే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్ హౌస్ లు ఆన్ చేస్తామన్నారు.

గోదావరి నది ఉదృతంగా పారుతుంది కానీ పైన ఉన్న లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు ఎడారిలా మారాయని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశించారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయడానికే పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. పంపులని ఆన్ చేస్తే రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు.. కానీ నీటిని వృధాగా పోనిస్తున్నారు కానీ లిఫ్ట్ చేయట్లేదని కేటీఆర్ మండిపడ్డారు.