31-07-2024 12:51:38 PM
హైదరాబాద్: ఇంటింటికీ ఉద్యోగం పేరుతో పదేళ్లపాటు మీరు ప్రజలను మోసం చేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? అని సీతక్క ప్రశ్నించారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీల తల్లిదండ్రుల పింఛను మీరు తొలగించారని సీతక్క ధ్వజమెత్తారు. చిరుద్యోగుల తల్లిదండ్రుల పింఛన్ తీసివేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీతక్క అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలిపారు. మీ వేధింపులు తట్టుకోలేకే ప్రజలు మాకు పట్టం కట్టారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. పొరుగుసేవల ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వలేదన్నారు.