ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి

26-04-2024 01:55:19 AM

నేతన్నలను ఆదుకోవాలి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నేత కార్మికుల కుటుంబాలకు పరామర్శ


రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గురువారం ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులు ఆడిచర్ల సాయి, అంకారపు మల్లేశం కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి, ఓదార్చారు. బాధిత కుటుంబాల కు రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తమ హాయం లో నేత కార్మికుల జీవితాలకు భరోసా కల్పించేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టి అండగా నిలిచామన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం తమపై కక్షతో నేతన్నల కోసం గతంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ఆపేసి వారి ఆత్మహత్యలకు కారణమయ్యిందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకా యిలు, బతుకమ్మ చీరల ఆర్డర్లు, స్కూల్ యూనిఫాం ఆర్డర్లు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

బీజేపీ నేతల పరామర్శ

ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను భాజపా అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. నేతన్నలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.