15-09-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
అలంపూర్ సెప్టెంబర్, 14:గద్వాల పర్యటనకు విచ్చేసిన కేటీఆర్ తేరు మైదానం సాక్షిగా అబద్ధాలు మాట్లాడి ఎంతో చరిత్ర కలిగిన తీరు మైదానాన్ని అబద్ధాలకు అడ్డగా మార్చి నడిగడ్డ ప్రాంత పరువు ,ప్రతిష్టను దిగ జార్చిపోయారని కేటీఆర్ పై ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. టెక్స్ టైల్ పార్క్ మల్లమ్మ కుంట, నకిలీ విత్తనాల గురించి ఏమీ మాట్లాడకుండా సొల్లు కబుర్లు చెప్పి వెళ్లాడని విమర్శించారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాలుగు మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి సాయం చేయకుండా సొల్లు కబుర్లు చెప్పినట్లు మండిపడ్డారు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన కేటీఆర్.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ..పదేళ్ల బిఆర్‌ఎస్ పరిపాలనలో అదే తేరు మైదానంలో అటు ఇటు కూర్చుందాం మంత్రులను పిలిచి చర్చ పెడదామా? అని మంత్రిని ప్రశ్నించారు.శాడిస్టు, ఫ్యూడల్ ఐడియాలజితో గెలుచి పోతారు తప్ప ..ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమంపై ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యేకు ఏ మాత్రం సోయలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ను మీ తండ్రిగారి పక్కన కూర్చోని నియోజకవర్గానికి అత్యధికంగా గురుకులాలకు తెచ్చుకుంటే... నేటి వరకు ఒక్క బిల్డింగ్ నిర్మాణం కూడా చేపట్టలేదని మండిపడ్డారు.