calender_icon.png 15 September, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీలో ‘యాత్రదానం’ టూర్ ప్యాకేజీ

15-09-2025 12:00:00 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 14 : ఆర్టీసీ సంస్థ పేద విద్యార్థుల కోసం ’యాత్ర దానం’ పేరుతో కొత్తగా టూర్ ప్యాకేజీ అమలు చేస్తుంది. ఆర్టీసీ ప్రవేశ పెట్టిన ’యాత్ర దానం’ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని హయత్ నగర్ డిపో మేనేజర్ విజయ్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అనాథ, పేద విద్యార్థులు, మానసిక దివ్యాంగ విద్యార్థులకు ఉత్సహం కల్పించడానికి ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజంగ్ డైరెక్టర్ సజ్జనార్ ఆదేశాలతో సామామాజిక సేవా దృక్పథం ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘యాత్ర దానం‘ టూర్ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా హయత్ నగర్ పరిసర ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, సేవా భావం  ఉన్నవారు విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక బస్సలు  కేటాయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు హయత్ నగర్ ఆర్టీసీ డీఎం ఫోన్ నెంబర్ 9959226138,  సహాయ మేనేజర్ ఫోన్ నెంబర్ 95532 78191 సంప్రదించాలని హయత్ నగర్ 1 డిపో మేనేజర్ జలగం విజయ్ కోరారు.