కాంగ్రెస్, బీజేపీల అక్రమాలను అడ్డుకుందాం
ప్రతి బూత్‌లోనూ మన ఓటును కాపాడుకోవాలి
ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు మన పార్టీ శ్రేణులు ప్రయత్నం చేయాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై కేటీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పైన దృష్టి సారించి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడకుండా చూడాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని అనేక రాష్ట్రాల్లో లక్షలాది ప్రతిపక్ష పార్టీల ఓట్లను బీజేపీ తీసివేసిందన్న ఆరోపణలు విస్తృతంగా తలెత్తుతున్నాయన్నారు.
మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా లబ్ధి పొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఖచ్చితంగా ఈ ఎస్‌ఐఆర్ కార్యక్రమం దుర్వినియోగం చేసే ప్రమాదం రాష్ట్రంలో ఉన్నదని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలన్నా రు. బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను కాపాడుకోవడంతో పాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలన్నారు. త్వరలో జరగనున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం పైన పార్టీ శ్రేణులకు గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.
సర్ మార్గదర్శకాల ప్రకారం బూత్ లెవల్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెం ట్ల నియామకానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ మొత్తం బూత్ లెవల్ ఏజెంట్ల ఎంపిక, వారి వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు అందించి వారి నియామకం వెంటనే పూర్తయ్యేలా చూసుకోవాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు పార్టీ తరఫున ఒక శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్ ప్రాధాన్యత, సర్ నిర్వహించే తీరు, అందులో బూత్ లెవ ల్ ఏజెంట్లు చేయవలసిన విధులు, బాధ్యతలను కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
క్రీడాకారులకు సహకారమందిస్తా
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ జన్మదినాన్ని పుర స్కరించు కొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్కులు, ట్రోఫీలను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసం లో కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది కేసీ ఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా వరంగ ల్ పశ్చిమ గులాబీ శ్రేణులను, కాకతీయ క్రికె ట్ అకాడమీ సభ్యులను అభినం దించారు. బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడు తూ...కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత 8 ఏండ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరే ట్లు తదితరులు పాల్గొన్నారు.






