calender_icon.png 24 May, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి

24-05-2025 12:00:00 AM

- కాంగ్రెస్ నేతల డిమాండ్

నిర్మల్‌మే 23 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత మాజీ మం త్రిపై బీఆర్‌ఎస్ కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండి స్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీఎం ఎస్ మాజీ చైర్మన్ రెడ్డి పీఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి ధ్వజమెత్తారు.

ఉమ్మడి ఆదలాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ నేతల కార్యకర్తల సమావేశం లో కేటీఆర్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని ఉద్దేశపూర్వకంగా కించపరిచే విధంగా మాట్లాడడం తగదన్నారు. కేసీఆర్ కంటే ముందు ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి 42 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కోసం కొట్లాడిన విషయాన్ని కేటీఆర్ గుర్తించుకోవాలని పేర్కొన్నారు. తమ నాయకుడికి పార్టీలో గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు విమర్శిం చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఆయనకు ఎప్పుడు గౌరవం ఉందని పదేళ్లుగా మంత్రి పదవి ఆయన గౌరవంతో దక్కిందని తెలిపారు.