నారాయణమూర్తికి కేటీఆర్ పరామర్శ
21-07-2024 12:03 AM
ఫోన్ చేసి మాట్లాడిన మాజీ మంత్రి
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు, దర్శకుడు నారాయణ మూర్తిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఫోన్‌లో పరామర్శించారు. నారాయణమూర్తికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మూర్తి ఈ నెల 17న అస్వస్థతకు గురవగా వెంటనే నిమ్స్‌కు తరలించారు. రెండు నెలల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.






