22 June, 2026 | 4:20 AM

112 మంది తహసీల్దార్ల బదిలీ

21-07-2024 12:05 AM
  • మల్టీజోన్-1, 2లో సాధారణ బదిలీలు
  • సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లను, డిప్యూటీ తాహసీల్దార్లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ - 1 పరిధిలో సుమారు 56 మంది, మల్టీజోన్-2 పరిధిలో మరో 56 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. జోన్ - 6 పరిధిలో 35 మందిని, జోన్ -7 పరిధిలో 18 మంది డిప్యూటీ తహసీల్దార్లు బదిలీ అయ్యారు. అలాగే జోన్ -1 పరిధిలో 10 మందిని, జోన్ -2 పరిధిలో 6 మందిని, జోన్-3 పరిధిలో 16 మందిని, జోన్-4 పరిధిలో 10 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారు. స్పౌస్‌గ్రౌండ్స్‌తో పాటు నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను, వ్యక్తిగత అభ్యర్థన మేరకు 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తహసీల్దార్లను, డిప్యూటీ తహసీల్దర్లను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులను కలెక్టర్లు వెంటనే రిలీవ్ చేయాలని, బదిలీ ఉత్తర్వులు అందిన మూడు రోజుల్లోపు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు కేటాయించిన జిల్లాలో కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.