22-10-2025 12:29:38 AM
కాకతీయ యూనివర్సిటీ,అక్టోబర్ 21st (విజయక్రాంతి): అక్టోబర్ 24 నుంచి 31 వరకు పంజాబ్లోని భటిండా గురు కాశీ యూనివర్సిటీలో నిర్వహించనున్న అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ (పురుషులు మరియు మహిళలు) పోటీల కోసం విశ్వవిద్యాలయ జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోరట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై. వెంకయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎంపికలో ఇండియన్ రౌండ్ (పురుషులు): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన టి. సునీల్ కుమార్, రీకర్వ్ రౌండ్ (పురుషులు): హనంకొండ కాకతీయ డిగ్రీ కాలేజీకి చెందిన బి. గంగరాజు, తొర్రూరు సమతా డిగ్రీ కాలేజీకి చెందిన చి. త్రిశూల్, భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన ఈ. ఆనంద్, కే. అశ్విత్ దొర; రీకర్వ్ రౌండ్ (మహిళలు): వరంగల్ సి.కే.ఎం. ఆరట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన తన్వీర్ కౌసర్ ; కాంపౌండ్ రౌండ్ (మహిళలు): వరంగల్ పద్మావతి డిగ్రీ కాలేజీకి చెందిన మన్సురహ హసిభా, ఈ బృందానికి కోచ్-కమ్-మేనేజర్గా హనంకొండ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీ వ్యాయామ అధ్యాపకులు పి. రాజేష్ వ్యవహరిస్తారు.