calender_icon.png 25 October, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

22-10-2025 12:30:58 AM

ఒకరి పరిస్థితి విషమం

ధర్మపురి, అక్టోబర్21(విజయక్రాంతి):గొల్లపల్లి మండలం కేంద్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో ఒకరు వెల్గటూర్ మండలంలోని రాం నూర్ గ్రామానికి చెందిన బిడారి శ్రీకాంత్(26)కాగా, మరొకరు గొల్లపలి మండలం గోవిందుపల్లి గ్రామానికి చెందిన రాఘవ రెడ్డి(60) లుగా పోలీసులు గుర్తించారు.

మృతుడు రాఘవరెడ్డి గోవిందుపల్లి నుండి తన భార్యతో గొల్లపల్లి మండల కేంద్రానికి తన భార్య సుగుణ (55)తో ద్విచక్ర వాహనంపై బయలుదేరగ, అదే సమయంలో గొల్లపల్లి నుండి ధర్మారం వైపువెళ్తున్న శ్రీకాంత్ తన ద్విచక్ర వాహనంతో అజాగ్రత్తగా వేగంగా ప్రయాణించడముతో బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రాఘవ రెడ్డి వాహనాన్ని డీకొట్టడముతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.