calender_icon.png 16 January, 2026 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌టీవీ విలేకరుల అరెస్టులను ఖండిస్తూ ధర్నా

16-01-2026 02:24:06 PM

 టిడబ్ల్యూజేఎఫ్ మద్దతు

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎన్‌టీవీ విలేకరుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్‌టీవీ విలేకరుల కు మద్దతుగా వివిధ జర్నలిస్టు సంఘాలు నిర్వహించిన నిరసన ధర్నాకు టీయూడబ్ల్యూజే(ఐజేయు), టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖలు సంపూర్ణ మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. ఎన్‌టీవీ విలేకరులు టి యు డబ్ల్యూ జే (ఐ జే యు),టిడబ్ల్యూజేఎఫ్ ల మద్దతు కోరగా, దానికి సానుకూలంగా స్పందించిన టి యు డబ్ల్యూ జె  (ఐ జేయు) ,టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు, సభ్యులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, శంకర్, రాజేష్, శీను, టిడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు కృష్ణమాచారి, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ లు మాట్లాడుతూ జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలని  ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు  పాల్గొని ఎన్‌టీవీ విలేకరులకు మద్దతు ప్రకటించారు. జర్నలిస్టుల అరెస్టులను వెంటనే రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయు), టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.