calender_icon.png 1 May, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వ తరగతి ఫలితాల్లో రాహుల్ విజ్ఞాన్ ప్రభంజనం

01-05-2025 02:48:56 PM

గురుదేవ్ విద్యాలయంలో  100% ఫలితాలు 

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సత్యనారాయణపురం  ప్రభుత్వ పాఠశాల హవా

చర్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన  పదవ తరగతి ఫలితాలలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. హాజరైన విద్యార్థులు 59 మంది కి గాను  ఉత్తీర్ణులైన విద్యార్థులు 59 మంది. మండలం లో అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా  రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం నిలిచింది. బిట్రగుంట.లాస్యలహరి 564  మార్కులు సాధించి మండలం లో ప్రధమ స్థానం పొందగా   గోగినేని వెస్లీ 545 పొంది పాఠశాల ద్వితీయ స్థానం,  జవ్వాది స్నేహ శ్రీ 543 తృతీయ స్థానం సాధించారు.  500కు పైగా మార్కులు 25 మంది సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు,తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డి ఎన్ కుమార్, డాక్టర్ ప్రతిభ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వి.పి.సి శాస్త్రి , కొసరాజు హరిచరణ్ , ప్రిన్సిపల్ వర్మ రాజు  అభినందనలు తెలియజేశారు.

గురుదేవ్ విద్యాలయంలో 100% ఫలితాలు

గురుదేవ్  విద్యాలయంలో 12 మందికి పైగా 500 మార్కులు 39 మందికి పైగా 400 మార్కులు ఇద్దరు విద్యార్థులు 380 మార్కులు పైగా సాధించారు, గురుదవ్ విద్యాలయంలో మొత్తం 53 మంది విద్యార్థులకు గాను 53 మంది సంపూర్ణ ఫలితాలను దక్కించుకున్నారు, పాఠశాల అధ్యాపకులు తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవి గిరి, పాఠశాల కోఆర్డినేటర్ శాస్త్రి, శ్రీనివాస్ లు విద్యార్థులను అభినందించారు

ప్రభుత్వ పాఠశాలలో 562 మార్కులు

 ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సత్యనారాయణపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో విద్యార్థిని  కసిపోగు జాను  562 మార్కులు సాధించి మండల స్థాయిలో అచ్యుత కుమార్కులు సాధించ, మండల ప్రజల మన్ననలను పొందారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.