calender_icon.png 2 May, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాబితాలో అవకతవకలు

01-05-2025 07:02:06 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పట్టణంలోని నిరుపేదలకు అందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాబితాలో అవకతవకలు జరిగాయని, కేవలం రాజకీయ జోక్యంతోనే పక్కదారిన పడుతున్నాయని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. క్యాతన్ పల్లి పురపాలకం రామకృష్ణాపూర్ పరిధి బీఆర్ఎస్ ప్రభుత్వం 286 ఇండ్లు నిర్మించగా, ఆన్ లైన్ ద్వారా 1 వేయి 959 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి 302 మందిని లబ్ధిదారులను ఎంపికచేశారు.

క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం అర్హుల జాబితాను విడుదల చేశారు. నాటి అధికారులు రూపొందించిన జాబితాను పక్కన బెట్టి రెండు రోజుల క్రితం మరో కొత్త జాబితాలను తయారుచేసి పుర కార్యాలయంలో నోటీసు బోర్డుపై అతికించారు. గతంలో అధికారులే పూర్తిస్థాయిలో లబ్దిదారులను ఎంపిక చేయగా, ఇప్పుడు ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు జాబితల తయారీలో ప్రధాన భూమిక పోషించారనే ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో నిరుపేదల సొంతింటి కల కలగానే మిగులుతుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రమేష్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వత్రిక ఎన్నికలు రావడం వల్ల కేసీఆర్‌ సర్కారు నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపు జరగలేదని గెలిచిన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అవకతవకలతో నిరుపేదలు బలి అవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులు గుర్తించిన లబ్దిదారుల పేర్లు లేకపోవడం, కొత్తవారి పేర్లు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 286 ఇండ్లు నిర్మించి ఉండగా కాంగ్రెస్ నాయకులు, అధికారులు కేవలం 236 ఇండ్లలకు 285 మంది అర్హుల లిస్ట్ విడుదల చేయడంపై మండిపడ్డారు. మిగిలిన రెండు పడకల ఇండ్లను ఎవరికి పంపిణి చేయడానికి జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి అనర్హులకు కాకుండా అసలైన పేద లబ్దిదారులకు 286 ఇండ్లను పంపిణి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంబాగోని సుదర్శన్ గౌడ్, రామిడి కుమార్, సంపత్, మాజీ కౌన్సిలర్లు రెవెళ్లి ఓదేలు, జీలకర మహేష్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.