calender_icon.png 2 May, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఘనంగా మే డే

01-05-2025 07:13:41 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం సింగరేణి ఏరియా కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరియా వైస్ ప్రసిడెంట్ రజాక్, కార్పొరేట్ ఏరియా వైస్ ప్రసిడెంట్, పీతంబార్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రసిడెంట్ త్యాగరాజన్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1886, మే 1 పాలకవర్గాల  దమనకాండలో చికాగో (అమెరికా) కార్మిక వర్గం రక్తం చిందించిందన్నారు. ఉరి కొయ్యలను సైతం లెక్క చేయక సాధించిన పోరాటాల ఫలితంగానే ఎనిమిది గంటల పనిని ప్రపంచం ఆమోదించిందన్నారు. 

వ్యవసాయ రంగం విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, యాంత్రికరణతో శ్రామికుడు ఎనిమిది గంటల పనిని నాలుగు గంటలలో చేస్తున్నాడని కానీ పెట్టుబడిదారులు, కార్మికుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి సంపద పోగేసుకోవడానికి 12 గంటల పనిని ముందుకు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సెంట్రల్ సెక్రటరీ అభిషేక్, సెంట్రల్ కమిటీ  మెంబెర్స్ నాగభూషణం, రాజేశ్వరరావు, స్వామి, పరమేష్, చిన్నీ, విప్లవ రెడ్డి, పోశం శ్రీనివాస్, వలస కూమర్, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీలు లలితా లక్ష్మీ, మహేష్ కుమార్, ఎం.అశోక్  వెంకటస్వామి, జల్లి కిరణ్, పిట్ సెక్రటరీ చిలక రాజయ్య, గోపి కుమార్, ఎండీ సత్తార్ పాషా, సురేందర్, జల్లారపు శ్రీనివాస్, సోమశేఖర్, రామస్వామి, రవీందర్, సాంబమూర్తి, భరత్, శ్రీనివాస్, పి. కృష్ణ మధు, రెహమాన్, రాజు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.