calender_icon.png 2 May, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థుల ప్రభంజనం

01-05-2025 06:48:39 PM

పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలువగా, జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాల్లో పదో తరగతి చదువుకున్న 939 మంది విద్యార్థుల్లో 933 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 99.36 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని పొందారని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దేశి రామ్(District Tribal Welfare Deputy Director Deshi Ram) తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హై స్కూల్ కు చెందిన గా పెళ్లి భరత్ 571/600 మార్కులతో ఉత్తీర్ణుడవగా, బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అక్షిత 563, ముత్యాలమ్మ గూడెం పాఠశాల విద్యార్థిని గుగులోత్ అఖిల 561 మార్కులతో ఉత్తీర్ణులై సరికొత్త రికార్డు సృష్టించినట్టు ఆయన తెలిపారు. అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను గురువారం సత్కరించారు.