01-05-2025 06:36:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు గురువారం అందించారు. మొత్తం 43 మందికి 18 లక్షల చెక్కులను పంపించి పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.