08-05-2025 12:00:00 AM
- ప్రజ్ఞాపూర్ రాణే పరిశ్రమలో వరుస గా 4వ సారి విజయం
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
గజ్వేల్, మే 7: కార్మిక సంక్షేమం కేవలం సిఐటియు తోనే సాధ్యమవుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, రాణే పరిశ్రమ కార్మిక యూనియన్ గౌరవాధ్యక్షులు చుక్కా రాములు అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రాణే బ్రేక్ లైనింగ్ పరిశ్రమ లో బుధవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఎంఎస్ పై 34 ఓట్ల మెజారిటీతో సిఐటియు విజయం సాధించిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు యూనియన్ గౌరవాధ్యక్షులు చుక్కా రాములు, యూనియన్ అధ్యక్షులు సిఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ తెలిపారు.
పరిశ్రమలో 155 ఓట్లు ఉండగా సిఐటియు94ఓట్లు రాగా, బి ఎం ఎస్ కు60.ఓట్లు పోల్ అయ్యాయి . 34 ఓట్ల మెజారిటీతో సిఐటియు విజయం సాధించింది. బిఎంఎస్ కార్మిక సంఘం నుండి జాతీయ ఉపధ్యక్షులు మల్లేశం పోటీ చేయగా, సిఐటియు నుండి యూనియన్ గౌరవ అధ్యక్షులుగా చుక్కా రాములు, అధ్యక్షులుగా మల్లికార్జున్ పోటీ చేశారు.
ఈ సందర్భంగా సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు యూనియన్ గౌరవ అధ్యక్షులు చుక్కా రాములు, యూనియన్ అధ్యక్షులు జె మల్లికార్జున మాట్లాడుతూ ఇది కార్మికుల విజయమని కార్మికులు సిఐటియును నమ్ముకొని నాలుగోసారి గెలిపించినందుకు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య, కామని గోపాలస్వామి, యూనియన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, , ఉప ప్రధాన కార్యదర్శి బండ్ల స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షపతి, చంద్రశేఖర్ రెడ్డి నర్సింలు, సాజిద్, వెంకట్రావు, శ్రీనివాస్, రంగారెడ్డి, రాజగోపాల్, స్వామి, మరాటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.