08-05-2025 12:00:00 AM
అబ్దుల్లాపూర్‌మెట్, మే 7: రోడ్డు ప్ర మాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం గ్రామానికి చెందిన పోతార్ల యశ్వంత్ (22) సేల్స్‌మ్యాన్ పనిచేస్తున్నాడు. యాదాద్రిభువనగిరి జిల్లా, పోచంపల్లిలో యశ్వంత్ బంధువులు ఉండడంతో తన స్కూటీ (టీఎస్ 07జేయూ 8591)పై బుధవారం పోచంపల్లికి వెళ్లాడు.
తిరిగి వస్తున్న క్రమంలో స్వగృహ వెంచర్ వద్ద రాగనే ఆదే సమయంలో (ఏపీ 24టీవీ 1433) నెంబర్ గల టాటా మ్యాజిక్ ఆటో ఎదురుగా వస్తున్న యశ్వంత్ (స్కూటీ)ని బలంగా ఢీకొట్టంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు.