calender_icon.png 20 August, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్‌లో అడ్డా కూలీ హత్య

05-07-2024 11:49:44 AM

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లో అడ్డా కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని బీరంగూడ వాసి సాయిలుగా గుర్తించారు. సాయిలు మియాపూర్ లో ఇసుక లారీ అన్ లోడ్ చేయడానికి వచ్చినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం టీ స్టాల్ నిర్వాహకుడు సతీశ్, సాయిలు మధ్య వాగ్వాదం జరిగింది. సాయిలుపై మరో ఇద్దరితో కలిసి టీ స్టాల్ నిర్వాహకుడు దాడి చేయించాడు. టీ స్టాల్ నిర్వాహకుడి దాడిలో సాయిలుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా సాయిలు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.