calender_icon.png 20 August, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాడ్ డెడ్

06-07-2024 10:07:23 AM

అమరావతి: అన్నమయ్య జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద వాహనం మరో కారు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం రాయచోటీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడప నుంచి రాయచోటి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బాధితుడు తెలిపాడు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.