బాసర ఆలయంలో మళ్లీ చోరీ
- ఏడాదిలోపే రెండు భారీ చోరీలు
- సీసీ కెమెరాలను ఆగని చోరీలు
- అమ్మవారి ఆలయం లో వెండి కిరీటం, హుండీ మాయం
- భద్రత వైఫల్యం పై భక్తుల మండిపాటు
నిర్మల్ జూన్ 23 ( విజయక్రాంతి)దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో భద్రత కరువైంది. భద్రత లోపాలు ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా బాసర ప్రధాన ఆలయం లోని ఏడాదిలో రెండుసార్లు భారీ చోరీలు జరగడం పోలీసులకు సవాల్గా మారింది. సోమవారం రాత్రి బాసర అమ్మవారి సన్నిధిలో భద్రకాళి ఆలయంలో ఉన్న విగ్రహం వెండి కెరటం పాటు ,ఇతర ఆభరణాలు, హుండీలో ఉన్న నగదును దొంగలు తస్కరించారు.
గత ఏడాది ఇదే సీజన్లో ఆలయ ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న దత్తాత్రేయ మందిరంలోవెళ్లిన గుర్తు తెలియని దుండగులు హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దోచుకెళ్ళారు. భక్తులు కట్న కానుక రూపంలో అమ్మవారికి వేస్తున్న నగదు వెండి ఆభరణాలను చోరీలు గురికావడంపై మండిపడుతున్నారు. బాసర అమ్మవారి సన్నిధిలో 100 మీటర్ల లోపే పోలీస్ స్టేషన్ ఉన్న దోపిడి దొంగలు పథకం ప్రకారం ఈ తరహా దొంగతనాలు చేయడం పోలీసులకు సవాలుగా మారింది.
దొంగలు అమ్మవారి ఆలయం కుడివైపు నుంచి ఆలయంలోకి వచ్చినట్టు సిసి ఫుటేజ్ లో రికార్డు అయింది. ఇద్దరు దొంగలు ముఖాలకు మాస్కులు వేసుకుని సీసీ కెమెరాలు ముందే పసకట్టి వాటికి గుడ్డలు కట్టి దిశ మార్చారు. సుమారు అరగంటసేపు ఈ చోరీ జరిగింది. బాసర ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ముందే గుర్తించిన దొంగలు పథకం ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది
భద్రతా లోపమే ప్రధాన కారణం
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరగడం భద్రత వైపల్లె లోపమే కారణమని భక్తులు బహిరంగంగానే విమర్శిస్తు న్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గుడి లోపల ప్రధాన ద్వారల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ దోపిడి దొంగలు వాటిని ముందే పసిగట్టి కెమెరాలకు చిక్కకుండా సోమవారం రాత్రి భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉన్న విగ్రహం వెండి కిరటం ఇతర బంగారం వెండి నగలను చాకచక్యంగా కాజేయడం నిగా వైఫల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఏడాది బాసర అమ్మవారి ఆలయం ప్రధాన కేటు గుండా లోనికి వెళ్లిన దుండగులు హుండీలను ధ్వంసం చేసి అందులో నగదులు ఎత్తుకెళ్లారు.
ఈ విషయాన్ని అప్పటి జిల్లా ఎస్పీ జానకి షర్మిల సీరియస్ గా తీసుకొని దొంగలను పట్టుకోవడమేకుండా సొమ్మును రికవరీ చేశారు. అయితే మహారాష్ట్ర కు చెందిన దొంగల ముఠా సభ్యులు పట్టుబట్టడంతో ఇటువంటి దొంగతనాలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఆలయంలో నిధులు నిర్వహించి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పాటు బాసర సివిల్ పోలీస్ ఆధ్వర్యంలో బాసర ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని నియమించి భద్రతా చర్యలు చేపట్టారు.
రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు భద్రతా సిబ్బంది కన్నుగప్పి వెనుక వైపు నుంచి సరస్వతి ఆలయం మందిరం పై అంతస్తులో మహంకాళి ఆలయ గేట్లు పగలగొట్టి విగ్రహం పై ఉన్న వెండి బంగారు నగలను దోచుకెళ్లారు. ఉదయం ఆలయంలో పూజలు చేయడానికి వచ్చిన పూజారులు అమ్మవారి విగ్రహంపై వెండి కిరీటం నగలు కనిపించకపోగా గేటు తాళం ధ్వంసం చేసి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి బాసర అధికారులకు సమాచారం ఇచ్చారు.
దొంగతనం చేయడం పోలీసులకు మింగుడు పడడం లేదు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రధాన జన సంచార కూడా. రోడ్డు మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాసర ప్రధాన ఆలయంతో పాటు పోలీస్ స్టేషన్కు లింక్ ఏర్పాటు చేశారు. అయితే సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని ప్రాంతాల్లో అవి కిందికి వేలాడుతున్న సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో దోపిడి దొంగలు పథకం ప్రకారం ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
బాసర మహారాష్ట్ర సరిహద్దులో ఉండడం ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండడంతో మహారాష్ట్ర కు చెందిన దొంగల ముఠా ఇక్కడికి వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలని పరిశీలించి, దొంగతనానికి రెక్కీ నిర్వహించి పోలీస్ సిబ్బంది లోపాలను గుర్తించి దొంగతనం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. బాసర ఆలయానికి ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తుల కు భద్రత కరువైందన్న విమర్శలు వినవస్తున్నాయి. భక్తులు రద్దీగా ఉన్న సమయంలో క్యూ లైన్ లో నిలబడినప్పుడు బయట సేద తీర్చుకున్నప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఇప్పటికైనా బాసర ఆలయ అధికారులు పోలీస్ సిబ్బంది సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఎమ్మెల్యే ఎస్పీపరిశీలన
బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ ఏఎస్పి సాయికిరణ్ హుటాహుటిన బాసరకు చేరుకున్నారు. చోరీ జరిగిన ఆలయాన్ని పరిశీలించారు. డాగ్స్ స్కాడ, ఫింగర్ ఫింగర్ ప్రింట, క్లూస్ టీం, రప్పించారు. డాగ్స్ చోరీ జరిగిన ప్రదేశం నుండి వెనుక వైపు గుట్టల దాకా వెళ్లి ఆగిపోయాయి. చోరీ చేసిన ఇద్దరు దొంగలు వెనుక వైపు నుంచి దిగి పారిపోయినట్టు తెలుస్తుంది.
సోమవారం రాత్రి ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న వారికి కనీసం చప్పుడు కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. భద్రత సిబ్బంది నిద్రపోవడం వలన ఈ చోరి జరిగినట్టు తెలుస్తుంది. చోరీ ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు దొంగలను త్వరలో పట్టుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. భద్రత వైఫల్యం పై అధికారులతో చర్చించారు. సీసీ కెమెరాలను పరిశీలించి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.






