6 July, 2026 | 2:57 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

పంచాయతీల్లో నిధుల కొరత

31-08-2024 03:27 AM

ముందుకు సాగని అభివృద్ధి పనులు

కొడంగల్, ఆగస్టు 30: సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి పంచాయ తీల్లో పాలన గాడి తప్పుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడం, పంచాయతీ ఖాతాల్లో డబ్బు లు లేక  అభివృద్ధి పనులు ముందుకు సాగ డం లేదు. ఫిబ్రవరి 2వ తేదీతో  సర్పంచుల పదవీ కాలం ముగియడంతో పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులపైనే పడింది. జీపీలకు నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణకు కార్యదర్శులే ఖర్చు చేస్తున్నారు. పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినా ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో గ్రామాలను సందర్శించడంలేదు. వారంలో ఒక్కసారి కూడా గ్రామాలను సందర్శించిన సందర్భాలు లేవు. కార్యదర్శులే ముఖ్యమైన పనులు, సంతకాల కోసం ప్రత్యేకాధికారుల వద్దకు వెళ్తున్నారు.