calender_icon.png 29 August, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్ సర్కిల్లో రూ.56 లక్షల పన్ను స్కాం

29-08-2025 03:13:45 AM

  1. సర్కిల్లో నిధుల లెక్కల పై ఆడిట్ చేయడంతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి స్కాం  వెలుగులోకి 
  2. ఒక్క రోజులోనే స్కాం నిధులు ప్రభుత్వ ఖజానాలో జమ

శేరిలింగంపల్లి ,ఆగస్ట్ 28: జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ లో భారీ పన్ను కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రజలు చెల్లిం చిన రూ.56 లక్షల సూపర్ స్ట్రక్చర్ పన్ను ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా కార్యాలయంలో విధులు నిర్వహించే ఔట్సోర్సింగ్ ఉద్యోగి కాజేసిన విషయం ఆలస్యం గా ఆడిటర్లు గుర్తించారు.  2016 జీవో-299 ప్రకారం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేసిన భవనాలపై ప్రత్యేక పన్ను నగదు రూపంలో వసూలు చేస్తున్నారు.

ఈ అవకాశాన్ని వినియోగించి, సిటిజన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్ సుభాషిణి సొంత లాగిన్లో రసీదులు ఇచ్చి మొత్తాన్ని ఖజానాకు జమ చేయకుండా మాయం చేసింది. ఆడిటర్లు ఖాతాలను పరిశీలించగా, 2024 ఏప్రిల్ 1 నుండి ఇప్పటివరకు మొత్తం రూ.56 లక్షల నగదు గల్లంతు అయినట్టు బయటపడింది. తప్పు ఒప్పుకున్న ఆమె ఆగస్టు 26న మొత్తం నగదును ఒకేరోజులో బ్యాంకులో జమ చేసింది.

అయితే 202124 మధ్యకాలంలో నూ పెద్ద ఎత్తున డబ్బు మాయం అయ్యి ఉండవచ్చని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. అధికా రుల పర్యవేక్షణ లోపం, ఆన్లైన్ లాగిన్ సిస్ట్ప కంట్రోల్ లేకపోవడం వల్లే ఈ అవకతవకలు జరిగినట్లు ఆడిటర్లు సూచిస్తున్నారు. ప్రస్తు తం సుభాషిణిపై ఎటువంటి క్రిమినల్ చర్యలు నమోదు కాలేదు.

అయితే ఈ వ్యవహారంలో ఆమె పాత్ర నే  ఉందా లేక  దీని వెనుక పై అధికారులు ఎవరినైనా ఉన్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలోమిగితా 29 సర్కిళ్లలోనూ సైతం ఇలాంటివే స్కాంలు ఉండవచ్చో నని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.