29-08-2025 03:11:52 AM
పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం ,ఆగస్టు 28 :విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో 47 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యేకు పూలమాలలతో, శాలువాలతో ఆహ్వానం పలికా రు. మల్లెలమడుగు, తురుములగూడెం, రా మచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం కాలనీ, సత్య నారాయణపురం గ్రామం, రామచంద్రపు రం గ్రామాలలో సీసీ రోడ్ల పనులకు ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజ లు ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఇందిర మ్మ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందించడం, 200 యూనిట్ల ఉచి త విద్యుత్, రైతు కూలీలకు ఆత్మీయ భరో సా, రైతు బీమా, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచి త ఆర్టీసీ బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఐదు లక్షల ఆర్థిక సహాయంతో ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు పేద కుటుంబాలకు వరప్రసాదంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్ర మంలో తాసిల్దార్ మనిధర్, ఎంపీడీవో ర వీంద్ర ప్రసాద్, డి ఈ వెంకటేశ్వరరావు, సిడిపిఓ రేవతి, ఐ టి డి ఏ ఏ ఈ వెంకటే శ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కొండలరావు, అనిల్, మండల నాయకులు ఓరుగంటి రమేష్, గాదే కేశవరెడ్డి, ఆవుల రవి, తూము వీర రాఘవులు, బేతం రామకృష్ణ. మచ్చా నరసింహారావు, ఖదీరు, బారాస సంపత్, రాగం మల్లయ్య,బురెడ్డి వెంకటరెడ్డి, తెల్లం వీరభద్రం, వంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.