calender_icon.png 21 May, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 2.50 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు

21-05-2025 12:02:25 AM

జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెల్లడి

యాదాద్రి భువనగిరి మే 20 ( విజయ క్రాంతి ): వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని , పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో శేఖర్ రెడ్డి తో కలిసి కలెక్టర్  నిర్వహణ తీరును పరిశీలించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా లేకపోవడంతో అధికారు లను సిబ్బందిని అదనంగా నియమించారు.  అంతేకాకుండా హమాలీల కొరత లేకుండా సంఖ్య పెంచుతూ లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశారు. 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

అకాల వర్షాలు ఉన్నాయన్న సూచన లతో జిల్లాలోని 35 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లలను వేగవంతం చేశారు. రైతులు అధర్యపడవద్దని అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు అధైర్య పడవద్దని, ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, చివరి ధాన్యం గింజ కొనుగోలు వరకు నిర్విరామంగా కృషి చేస్తామని రైతులకు ధైర్యం చెప్పారు. కలెక్టర్ వెంట అధికారులు ధాన్యం కొనుగోలు సిబ్బంది రైతులు పాల్గొన్నారు.