21-05-2025 12:03:53 AM
త్వరలోనే గంధ మల్ల ప్రాజెక్టు నిర్మాణ శంకుస్థాపన
యాదాద్రి భువనగిరి మే 20 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కూచ్చేందిన సాగునీటి కాలువలపై హైదరాబాదులోని జల సౌదాలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుర్కపల్లి మండలం గంధ మల్ల ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు.
త్వరలోనే గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలని. బునాది గాని కాలువ పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, బోనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.