calender_icon.png 23 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిగ్-21 విమానాలకు సెలవు

23-07-2025 12:18:43 AM

దశలవారీగా అమలు చేయనున్న వాయుసేన

న్యూఢిల్లీ, జూలై 22: భారత వాయుసేనకు కొన్నేళ్ల పాటు వెన్నముకగా నిలిచిన మిగ్-21 విమానాలకు సెలవు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఐఏఎఫ్ వెల్లడించింది. సెప్టెంబర్ 19వ తేదీన చండీగఢ్ బేస్‌లో వీడ్కోలు వేడుకను నిర్వహించనున్నారు. ఇక్కడే మిగ్-21ల 23వ స్కాడ్రన్ పాంథర్స్ ఉంది. ఇది అధికారికంగా రిటైర్ కానుంది.

ఈ ఫైటర్ విమానాల స్థానాన్ని దేశీయంగా తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే1ఏతో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం వాయుసేనలో 31 మిగ్-21 సేవలు అంది స్తున్నాయి. 1963లో మిగ్ విమానాలు తొలిసారి వాయుసేనలో చే రాయి. వీటిల్లో 600 దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)లో తయారు చేశారు.