calender_icon.png 26 July, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయస్థానాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి

25-07-2025 05:33:12 PM

సింగిల్ కోర్టుగా ఉన్న హుజూర్ నగర్ ను ఆరు కోర్టులుగా మార్చిన ఘనత

బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డికే దక్కింది

సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద

హుజూర్ నగర్: హుజూర్ నగర్ న్యాయస్థానాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సారిగా శుక్రవారం పట్టణానికి వచ్చిన సందర్భంగా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడారు. సింగిల్ కోర్టు గా ఉన్న హుజూర్ నగర్ ను ఆరు కోర్టుల హుజూర్ నగర్ గా మార్చిన ఘనత బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డికే దక్కిందన్నారు.నూతన కోర్టులలో  సిబ్బందిని కేటాయించి ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామ న్నారు.న్యాయమూర్తులు, న్యాయ వాదులు తమ వృత్తులలో పనిచేసి మానసికంగా అలసి పోతుంటారని అలాగే మానసిక ఒత్తిడికి గురువుతారని అందువల్ల మానసిక శారీరక ఉల్లాసానికి న్యాయస్థానాల ప్రాంగణంలో ఇండోర్ ఆటలు ఆడటానికి క్రీడా స్థలంను ఏర్పాటు చేసుకోవాలని న్యాయవాదులకు సూచించారు.న్యాయమూర్తిగా తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పనిచేశానని తనకు తన వృత్తి తృప్తిని కలిగించిందన్నారు. అంతకు ముందు ఆమెను న్యాయవాదులు గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె కోర్టును  పరిశీలించారు. రామస్వామి గుట్ట వద్ద న్యాయస్థానాలకు నూతనంగా కేటాయించిన స్థలాన్ని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు.