02-07-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
నాగారం, జూలై 1: భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మండలంలోని లక్ష్మాపురంలో భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిశీలన ప్రక్రియను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఆర్జీల పరిశీలన ప్రక్రియను, రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
దరఖాస్తు చేసుకున్న రైతులు పరిశీలనకు వచ్చిన రెవెన్యూ అధికారులకు తమ పూర్తి సహకారం అందించాలని, సమస్యకు సంబంధించిన ఆధారాలు, దస్తావేజులు తప్పక అధికారులకు చూపించాలన్నారు. ఈయమ వెంట ఆర్డీవో వేణుమాధవ్ రావు, తాసిల్దార్ హరి కిషోర్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ షఫీ మహమ్మద్, సర్వేయర్ సాయి, రాజు ఉన్నారు.