calender_icon.png 10 October, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ ఆక్రమణను నిలిపివేయాలి

10-10-2025 01:40:16 AM

ఎంఆర్‌వోకు వినతిపత్రం అందజేసిన ప్రజా సంక్షేమ సంఘం నాయకులు

మేడిపల్లి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపాలిటి కార్పోరేషన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా 14వ డివిజన్లో మేడిపల్లి రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.103లో భూ ఆక్రమణనలు జరుగుతున్నవి.దొంగ పట్టాలను తయారుచేసుకొని ఇండ్లు లేకున్న పట్టాలపై బై నెంబర్లు వేసుకొని ఇంటి నెంబర్లు తెచ్చుకొని దానిని సేల్డీడ్ గా మార్చుకుని అమ్ముకుంటున్నారు.గతంలో మాజీ మంత్రి టి. దేవేందర్ గౌడ్ 179 పట్టాలు నిరుపేదలకు పంచారు.

ఈ పట్టాలను ఆసరా చేసుకుని భూ ఆక్రమదారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయము గురించి గతంలో గ్రామ ప్రజలు ఎన్నో పిర్యాదులు చేసినప్పటికి ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న ధాఖలాలు లేవు. కావున భూ ఆక్రమనదారులను గుర్తించి వారి చెర నుండి భూమిని తిరిగి తీసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు,అవసరాలకు వినియోగించాలని అన్నారు.

మేడిపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థాన పరిదిలో ఉన్న స్థలంలో ప్రభుత్వ ప్రతిపాదిత ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటును కూడా విరమించుకోవాలని ప్రజా సంక్షేమ సంఘం నాయకులు మేడిపల్లి ఎంఆర్‌ఓ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తూళ్ళ బిక్షపతి గౌడ్, ఉడుతల బాలకృష్ణ గౌడ్, దేవ్ సింగ్ నాయక్, అశొక్ గౌడ్, జైపాల్ రెడ్డి, సంతోష్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, రమేష్ తదితరులు  పాల్గొన్నారు.