10-10-2025 06:13:51 PM
చిలుకూరు: చిలుకూరు పేపర్ ఏజెంట్ కే.శ్రీను మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా చిలుకూరు బస్టాండ్ సెంటర్లో మస్తాన్ టైలర్ షాపు వద్ద బల్లపై గురువారం రాత్రి సమయంలో ఫోను మరిచి వెళ్లారు. పేపర్ వేసే క్రమంలో సెల్ ఫోను దొరకడం జరిగింది. ఆ ఫోను చిలుకూరు పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ వర చేసి, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, సమక్షంలో ఊరుకొండ శివ, తండ్రి వీరస్వామి, చిలుకూరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించి, ఫోన్ వారికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులు, సెల్ ఫోన్ బాధ్యుడు ఊరుకొండ శివ, శ్రీనుని, అభినందించారు.