18 April, 2026 | 6:03 AM

భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం

16-05-2025 12:00 AM

తహసీల్దార్ అశోక్

కొండాపూర్, మే  15 : ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని, ఏళ్ళతరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని మండల తహసిల్దార్ అశోక్ అన్నారు. మండలంలోని సైదాపూర్, మారేపల్లి గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి సదస్సులో సైదాపూర్ లో 148, మారేపల్లిలో 56  ఆర్జీలు వచ్చిన ట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉప తహసిల్దార్ హేమంత్ కుమార్, ఆర్.ఐ రాజు, పం చాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రె స్ సీనియర్ నా యకులు హాజీ పటేల్, వంశీ ధర్ గౌడ్, ప్ర వీణ్ కుమార్, తలారి రాజు, మోతిలాల్ పాల్గొన్నారు.