18 April, 2026 | 7:53 AM

పర్సనల్‌గా టార్గెట్.. వేధిస్తున్న హైడ్రా అధికారులు

16-05-2025 12:00 AM
  1. కొహెడ భూ యజమాని సంరెడ్డి బాల్‌రెడ్డి ఆరోపణ
  2. న్యాయబద్దంగా నాపై కోర్టులో కొట్లాడాలని సూచన

అబ్దుల్లాపూర్‌మెట్, మే 15: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  పర్సనల్ గా టార్గెట్ చేసి.. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని  వివాదంలో ఉన్న కొహెడ 951, 952 భూ యజమాని సంరెడ్డి బాల్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ వచ్చి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ నెల 1న ఇదే భూమి విష యంలో ప్లాట్స్ ఓనర్స్, బాల్ రెడ్డికి మధ్య జరిగిన ఘర్షణలో మారణాయుధాలు ఉపయోగిస్తే సాధారణ దాడి కేసు ఎలా నమో దు చేస్తారు. హత్య యత్నం కేసు నమోదు చేయకుండా  ఏమీ చేశారని రంగనాథ్ సీఐని ప్రశ్నిస్తూ ఫైర్ అయ్యాడు. దీంతో  ఇదే విషయంలో భూ యజమాని బాల్ రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  పర్సనల్ గా టార్గెట్ చేసి వేధిస్తున్నా రని ఆరోపించారు. అలాగే తాను నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రాన్ని  ఫిబ్రవరి లో హైడ్రా కూచివేసిందన్నారు. తాను న్యాయబద్ధంగా కోర్టు ద్వారా ముందుకు వెళ్తుంటే తన ను అనేక ఇబ్బందులు పెట్టి వేధిస్తున్నారన్నా రు. హైడ్రా అధికారులకు బాల్‌రెడ్డి ఒక్కడే కనిపిస్తున్నట్లుందని అన్నారు.

సిటీలో చాలా  సమస్యలున్నాయని వాటిపై ఫోకస్ పెడితే బాగుటుందన్నారు.  తాను కొనుగోలు భూ మిలో అప్పుడు కూడా ఎలాంటి వెంచర్ లే దని తెలిపారు. వెంచర్ ఉండి ఉంటే న్యా యబద్ధంగా తనపై కోర్టులో కొట్లాడాలని అన్నా రు. తన వ్యవసాయ క్షేత్రంలో తనను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇబ్బందుల కు గురి చేస్తున్నారని అన్నారు. తాను చట్టానికి లో బడి ముందుకు వెళ్తానని చెప్పారు.