12-06-2025 12:40:58 AM
కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల, జూన్11( విజ యక్రాంతి): భూ భారతి సదస్సులు భూ సమస్యల పరిష్కారానికి ఉపయోగకరమని, ప్రజలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నా రు. బుధవారం ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొనారు.
ఈ సందర్భంగా రైతుల భూ సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్,వాటి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. అధికారులు దరఖాస్తుల స్వీకరణ విధానం, అందజేస్తున్న రశీదుల పరంగా ఏవైనా లోపాలున్నాయా అన్న విషయాలను సమీక్షించారు.ఏ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయన్న అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.
దరఖాస్తు ఫారాల్లో ఏవీ ఖాళీగా ఉండ కూడదని,ప్రతి కాలమూ పూర్తి సమాచారంతో పూరించాలని అన్నారు. దరఖాస్తుదారుడి పూర్తి ఆన్లైన్ దరఖాస్తును పరిశీలించి,ఎంట్రీ ప్రక్రియ ఎలా జరుగుతోందో చూశారు.అధికారులను రోజూ అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి,అప్డేట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,ఆర్డీఓ అలివేలు,తహసీల్దార్ ప్రభాకర్, రెవిన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.