calender_icon.png 13 July, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

12-06-2025 12:42:37 AM

అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 11: ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధి బుధవారం చోటు చే సుకుంది.స్థానికులు పోలీసులకు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా, రెడ్డి చింతలకు చెందిన మనోహర్ రెడ్డి (41) హైదరాబాద్ నగరానికి వలస వచ్చి.. కుటుంబ సభ్యులకు కలసి వనస్థలిపురంలో నివాసం ఉంటూ..

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవన సాగి స్తున్నాడు.  రియల్   వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో పాటు,  ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా తోడయ్యాయి. దీంతో జీవితం మీద విరక్తి చెంది.. ఉదయం బయటికి వెళ్ళి వస్తానని చెప్పి.. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బలిజగూడ ఓ ఆర్‌ఆర్ అవుట్ రోడ్డు సమీపంలో ఏ ఎల్ నగర్ వెంచర్ లో ఉన్న చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన స్థానికులు వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్, 100 కు డైలీ చేసి స మాచారాన్ని ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా.. మనోహర్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మనోహర్ రెడ్డి మృతి దేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించినట్లు పోలీసుల తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ వి. అశోక్ రెడ్డితెలిపారు.